Murder in Guntur: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే అసిస్టెంట్ మేనేజర్ యువరాజ్ విష్ణు దారుణ హత్యకు గురయ్యారు. సహచర ఉద్యోగే విష్ణును హతమార్చాడు. ఆపై కాలువలో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులో రైల్వే అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న యువరాజ్ విష్ణు ఈనెల 23వ తేదీన మిస్ అయ్యాడు. ఆయన మిస్సింగ్‌పై బంధువులు 24వ తేదీన బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. యువరాజ్ విష్ణు హత్యకు గురయ్యాడని తేల్చారు. రూ. 20వేల విషయంలో సహచర ఉద్యోగి అమర్జీత్.. విష్ణుని హతమార్చినట్లు తేల్చారు. విష్ణును హతమార్చిన నిందితుడు. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని నల్లమాడు కాలువలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అయితే ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా, మృతుడి స్వస్థలం చత్తీస్‌గఢ్ లోని బిలాయ్ సిటీగా గుర్తించారు.
Also read:
KGF 2 Update: రాఖీ భాయ్ వచ్చే సమయం ఆసన్నమైంది.. కేజీఎఫ్ 2 వచ్చేదెప్పుడంటే…