AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..! జనసేనానికి ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను ఆయన ప్రస్తావించగా, తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదని, అన్ని భాషలకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు, ప్రకాష్ రాజ్ వంటి వారు కౌంటర్ ఇచ్చారు.

అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..! జనసేనానికి ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌
Prakash Raj Pawan Kalyan
SN Pasha
|

Updated on: Mar 15, 2025 | 3:33 PM

Share

జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలోని అన్ని భాషలు అవసరం అని, హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను హిందీలో డబ్‌ కూడా చేయొద్దని పవన్‌ అన్నారు. అయితే హిందీపై తమిళనాడులో ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. హిందీని తమపై బలవంతంగా రుద్దొరంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. తాము తమిళానికి ప్రాధాన్యం ఇస్తామంటున్నారు.. ఈ క్రమంలో ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

ప్రస్తుతం కొందరు భాష, సంస్కృతినీ తిడుతున్నారని.. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు. ‘అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి డబ్బింగ్‌ చేయకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా?, బిహార్‌ వాళ్లు వచ్చిన ఇక్కడ పనిచేయాలి, కానీ హిందీ వద్దు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది’ అన్నారు పవన్ కళ్యాణ్.

ఆయన వ్యాఖ్యలపై అటు డీఎంకే నేతలు కూడా స్పందించారు. అలాగే సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.’మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. గతంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ పలు అంశాలపై స్పందించిన సమయంలో ప్రకాశ్‌ కూడా ఆయనకు కౌంటర్‌గా స్పందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.