TDP: నారా లోకేష్‌ ప్రకాశం జిల్లా శంఖారావం వాయిదా.. పర్యటన ఎప్పుడంటే..

మార్చి 3 తేది నుంచి 5వ తేది వరకు ఉమ్మడి ప్రకాశంజిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఒంగోలు వైసిపి సిట్టింగ్‌ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన వారసుడు మాగుంట రాఘవరెడ్డిలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైంది. వీళ్ళు పార్టీలో చేరిన తరువాత ప్రకాశంజిల్లాలో పర్యటించాలని నిర్ణయించారట.

TDP: నారా లోకేష్‌ ప్రకాశం జిల్లా శంఖారావం వాయిదా.. పర్యటన ఎప్పుడంటే..
Nara Lokesh
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 01, 2024 | 9:16 PM

మార్చి 3 తేది నుంచి 5వ తేది వరకు ఉమ్మడి ప్రకాశంజిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఒంగోలు వైసిపి సిట్టింగ్‌ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన వారసుడు మాగుంట రాఘవరెడ్డిలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైంది. వీళ్ళు పార్టీలో చేరిన తరువాత ప్రకాశంజిల్లాలో పర్యటించాలని నిర్ణయించారట. వాస్తవానికి మార్చి 3 నుంచి ప్రకాశంజిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి నారా లోకేష్‌ శంఖారావం పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. 2వ తేదీ రాత్రికి లోకేష్‌ ప్రకాశంజిల్లా యర్రగొండపాలెంకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 3 వతేది ఉదయం యర్రగొండపాలెం టిడిపి నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేరోజు మధ్యాహ్నం గిద్దలూరులో, సాయంత్రం మార్కాపురంలో జరిగే సమావేశాల్లో లోకేష్‌ పాల్గొనాలి. ఆదివారం రాత్రికి దర్శిలో బసచేసి సోమవారం ఉదయం దర్శి, ఒంగోలు, కొండపిలలో జరిగే శంఖారావం కార్యక్రమాల్లో పాల్గొనాలి. సోమవారం రాత్రికి కందుకూరులో బసచేసి మంగళవారం ఉదయం కందుకూరులో మధ్యాహ్నం కనిగిరి నియోజకవర్గం పామూరులో జరిగే శంఖారావం కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రానికి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్ళాలి.

మాగుంట కోసమేనా..

అయితే ఫిబ్రవరి 28న ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపికి రాజీనామా చేయడంతో ఆయన టిడిపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. టిడిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎంపి మాగుంట కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే రెడీగా ఉన్నారు. ఈనెల 2న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టిడిపిలో చేరుతున్నందున అదేరోజు ఎంపి మాగుంట కుటుంబం కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. లేకపోతే మరో రోజు ఎంపి మాగుంట పార్టీలో చేరేందుకు ఇప్పటికే టిడిపి అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు టిడిపి ఎంపి అభ్యర్ధిగా మాగుంట రాఘవరెడ్డిని ప్రకటించిన తరువాత ప్రకాశంజిల్లాలో పర్యటిస్తే అన్నీ కలిసి వస్తాయని టిడిపి అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈనెల 3వ తేది నుంచి ప్రకాశంజిల్లాలో ప్రారంభం కావాల్సిన నారా లోకేష్‌ శంఖారావం వాయిదా పడినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కొండపి మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో టిడిపి అసెంబ్లీ అభ్యర్దులు ఓడిపోయారు. దీంతో ఈసారి ఒంగోలు పార్లమెంట్‌లోని అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో విజయం సాధించే దిశగా ఎంపి మాగుంటను పార్టీలో చేర్చుకుని పశ్చిమ ప్రకాశంలో టిడిపి పాగా వేయాలని ఉవ్విళ్ళూరుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles