YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్ (Political Heat) మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. మరోవైపు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాల కార్యకర్తల మధ్య మాటల దాడి నుంచి ఒకరి పై ఒకరు దాడి చేసుకునే వరకూ చేరుకున్నాయి రాజకీయ కక్షలు. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లవర్షం కురిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…
జిల్లాలోని శావల్యాపురం మండలం కారుమంచి లో అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య తిరునాళ్ల సందర్భంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చి.. ఈరోజు ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల వారు ఒకరినొకరు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాల కార్యకర్తలు గాయపడ్డారు. సుమారు 17మంది గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో కారుమంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తిత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి చికిత్స నిమిత్త తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు గ్రామంలోని ఇరువర్గాల మధ్య సయోధ్యకు కుదిర్చి.. వివాదానికి చెక్ పెట్టె దిశగా పోలీసులు ప్రయత్నం చేస్తోన్నట్లు తెలుస్తోంది.
Shocking: జాంబీ టెర్రర్.. తోటి జింకలను చంపి తింటున్న వైరస్ సోకిన జింకలు..