తిరుమల(Tirumala) బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. నాలుగు రోజుల హైడ్రామా తరువాత గోవర్దన్ ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న తిరుమల అఖిలాండం వద్ద బాలుడు కిడ్నాప్(Kidnap) కు గురయ్యాడు. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. చిన్నారిని మైసూర్ తీసుకెళ్లింది. అక్కడ ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు గోవర్దన్ ను తీసుకెళ్లింది. చిన్నారిని ఎందుకు తీసుకొచ్చావని మహిళ తల్లిదండ్రులు ప్రశ్నించడంతో తిరుమలకు వచ్చి చిన్నారిని విజిలెన్స్‌కు పోలీసులకు అప్పగించింది. తిరుమలలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ కోసం తిరుమల పోలీసులు తమిళనాడులోనూ గాలింపు చేపట్టారు. బాలుడి అదృశ్యంపై(Missing) కేసును నమోదు చేసిన తిరుమల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తిరుమల పోలీసు అధికారుల ఆధ్వర్యంలోని రెండు పోలీసు బృందాలు కడప, నెల్లూరు జిల్లాలోనూ గాలింపు చేపట్టగా మరో బృందం తమిళనాడులోని జోళారుపేట, కాట్పాడిలో గాలింపు చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. తిరుపతి దామినేడు ప్రాంతానికి చెందిన గోవర్దన్ రాయల్.. అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం 5 .45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన జరిగింది. సైలెంట్ గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
West Godavari: ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం