Andhra News: రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి.. అప్రమత్తమై పీఎస్‌కు తరలించిన పోలీసులు!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సిరిపురం ప్రాంతంలో అనుమానాస్పదంగా వ్యక్తి సంచరిస్తున్న ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పందంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతని బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు.

Andhra News: రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి.. అప్రమత్తమై పీఎస్‌కు తరలించిన పోలీసులు!
Ap Police

Updated on: May 10, 2025 | 4:09 PM

రోడ్లపై అనుమానాస్పందంగా తిరుగుతూ స్థానికులను భయాందోళను గురిచేస్తున్న ఓ వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. గత కొన్ని రోజులుగా విశాఖ జిల్లాలోని సిరిపురం ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అతను స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో అనుమానితంగా తిరుగుతూ ఉన్న దృశ్యాలు, ఫొటోలను కొందరు తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. దీంతో ఫొటోలు కాస్తా వైరల్‌ అయి పోలీసుల దృష్టికి చేరాయి.

దీంతో స్థానిక పీఎం పాలెం పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేటకు పార్వతీపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. అయితే అతను బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా పీఎం పాలెం పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పదంగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు అతని అలా తిరుగుతున్నారు. అతని ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అనే కోణంలో పోలసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగూ కనిపిస్తూ తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us