Narendra Modi: విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ హర్షం!

యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. తాజాగా ఇంటర్నేషనల్‌ యోగాడే సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Narendra Modi: విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ హర్షం!
Pm Modi

Updated on: Jun 22, 2025 | 5:02 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 3.01లక్షల మందితో విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుంకుంది. గతంలో గుజరాత్‌ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఆంధ్రప్రదేశ్‌ బ్రేక్ చేసింది. ఇదే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థుల చేసిన సూర్య నమస్కారాలకు గాను మరో గిన్నిస్‌ రికార్డు లభించింది.

అయితే యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. మోగా డే సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఏపీ ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని.. ఈ కార్యక్రమం అనేక మందిని మంచి ఆరోగ్యం, శ్రేయస్సు దిశగా తీసుకెళ్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఇది ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకొని నిత్యం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..