Dwaraka Tirumala: అయ్యో.. ఈ కుక్కకు ఎన్ని బాధలొచ్చాయి.. చివరకు..

ద్వారకాతిరుమల కొండపై పడేసిన ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చిన కుక్క తీవ్ర ఇబ్బందులు పడింది. ఆహారం కోసం లోపలికి తల పెట్టడంతో బయటకు రాకపోవడంతో భక్తులు కలిసి ప్రయత్నించి కుక్కను రక్షించారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Edited By:

Updated on: Mar 13, 2026 | 11:59 AM

పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు ఉన్నా.. అవి అమలు కాకపోవటం పర్యావరణానికి జంతుజాలానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. దూరాభారంతో భక్తులు తమవెంట ఆహార పదార్థాలను ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్తుంటారు. పులిహోర, రైస్, కూరలు, నీరు తమ వెంట ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో తెచ్చు కుంటారు. అయితే వీటివల్ల ప్రత్యక్షంగా ఒక కుక్క పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల కొండమీద ఒక కుక్క అక్కడ పడి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో తలదూర్చింది. అందులో ఉన్న ఆహారం కోసం మరింతగా లోపలకి తల దూర్చటంతో అందులో దాని తల ఇరుక్కుపోయింది. ఇక దాని పరిస్థితి వర్ణణాతీతం. అందులో నుంచి తల బయటకు రాకపోవడంతో తలకు హెల్మెట్ పెట్టినట్లు దాంతోనే కొండపైన అరుచుకుంటూ భక్తులకు కనిపించింది. ఆహారం, నీరు కోసం కుక్క పడుతున్న పాట్లు చూసిన భక్తులు దాన్ని పట్టుకుని కాళ్లు ఒకరు, తల భాగం మరొకరు పట్టుకుని బలవంతంగా లాగటంతో ఎట్టకేలకు ప్లాస్టిక్ డబ్బు నుంచి కుక్క తల బయటకు వచ్చింది. దాన్ని అక్కడ ఉన్న ఉన్న భక్తులు ఆసక్తికరంగా గమనించారు. అన్ని రకాలుగా ఇబ్బందిగా మారిన ఈ ప్లాస్టిక్‌ను వాడొద్దని అధికారులు మరీ.. మరీ సూచిస్తున్నారు.

Also Read: కరివేపాకు చెట్టుకు ఇది వేశారంటే.. సూపర్‌గా పెరుగుతుంది.. 

Loading...
Unable to load recommendations.
Follow Us