మంగళ, శుక్రవారాల్లో హారతులివ్వండి : పవన్ పిలుపు

తూర్పుగోదావరిజిల్లా అంతర్వేదిలో చోటు చేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట.. ఇప్పుడు..

మంగళ, శుక్రవారాల్లో హారతులివ్వండి : పవన్ పిలుపు

Updated on: Sep 08, 2020 | 8:29 PM

తూర్పుగోదావరిజిల్లా అంతర్వేదిలో చోటు చేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట.. ఇప్పుడు అంతర్వేది. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికాలు కావన్నారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని సర్కారు చెబుతుండటంపై ఆయన ఘాటుగా స్పందించారు. మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారన్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని పవన్ పిలుపునిచ్చారు. ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలని పవన్ కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us