Andhra News: భార్యతో మనస్పర్థలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సాలూరు పట్టణం డబ్బివీధిలో జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. స్థానికంగా నివాసముంటున్న బొబ్బిలి పరమేశు (37) అనే వ్యక్తి తన ఇంట్లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని స్వాధీనం చేసుకొని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: భార్యతో మనస్పర్థలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఏం చేశాడంటే?
Andhra News

Edited By:

Updated on: Feb 07, 2026 | 3:45 PM

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరమేశు అనే వ్యక్తి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న పరమేశు‌, భవాని దంపతులకు సుమారు 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా పరమేష్, భవానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న ఇరువురి మధ్య వైవాహిక జీవితం మాత్రం సరిగ్గా సాగడం లేదు. దీంతో పాటు పరమేశ్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ వైపు అనారోగ్యం. మరోవైపు భార్యతో మనస్పర్థలు.. దీంతో తీవ్ర మనస్థాపినిక గురైన పరమేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంట్లో చున్నీకి వేలాడుతూ కనిపించిన పరమేశ్‌ను చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరమేశ్ మృతితో కుటుంబమంతా విచారంలో మునిగిపోయింది. పిల్లలు తండ్రిని కోల్పోయిన విషాదంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా భార్యతో పాటు కుటుంబ సభ్యులను స్టెట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగానే పరమేష్ మృతి చెందాడని భార్య చెప్పుకొచ్చింది. కుటుంబ సభ్యులు మాత్రం పరమేశ్‌ మృతి చెందటానికి కొద్ది నిమిషాల ముందు కూడా భార్యతో గొడవ పడినట్లు తెలిపారు. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు పరమశేష్ మృతికి గల కారణాలపై తేల్చే పనిలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.