AP Privilege Committee : రెండోసారి నోటీసులు పంపిన ప్రివిలేజ్ కమిటీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామానాయుడు..

|

Sep 15, 2021 | 12:07 PM

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అదనపు సమాచారం కావాలని..

AP Privilege Committee : రెండోసారి నోటీసులు పంపిన ప్రివిలేజ్ కమిటీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామానాయుడు..
Nimmala
Follow us on

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అదనపు సమాచారం కావాలని కోరుతూ కమిటీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. అయితే, తనకు రెండోసారి నోటీసులు జారీ చేయడంపై నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ అంటే ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించే దేవాలయం అని, అధికార, ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ సమ న్యాయం చేసినప్పుడే ఆ సభకు గౌరవం లభిస్తుందని వ్యాఖ్యానించారు. సభలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్న చేయడం దారుణం అని అన్నారు. అధికార పార్టీ సభ్యులు.. ప్రతిపక్ష సభ్యులను బూతులు తిట్టినా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్ర ప్రజల గొంతు వినిపిస్తున్న సభ్యులను బయటకు పంపడానికే ప్రివిలైజ్ కమిటీ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారని నిమ్మల ఆరోపించారు. శాసన సభలో మాట్లాడిన దానికి ఆధారాలతో సమగ్ర వివరణ ఇచ్చినా మళ్లీ వివరణ కావాలంటూ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు.

కాగా, మంగళవారం నాడు ఉదయం అసెంబ్లీ క‌మిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ భేటీ అయ్యింది. పెండింగులో ఉన్న సభా హక్కుల ఉల్లంఘ‌న కేసుల‌పై చ‌ర్చించింది. అందులో టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కూన రవి కుమార్, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఉన్న పిటిషన్లపై చ‌ర్చించింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన ర‌వికుమార్, నిమ్మల రామానాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. తమ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఆ వివరణకు సంతృప్తి చెందని ప్రివిలేజ్ కమిటీ.. మరింత వివరణతో కూడిన సమాచారం ఇవ్వాలంటూ రామానాయుడికి మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పై విధంగా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

Also read:

నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

AP Polycet 2021 Results : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే..

Panja Vaisshnav Tej : పవన్ కళ్యాణ్ దర్శకుడితో ‘పంజా’ వైష్ణవ్ నెక్స్ట్ సినిమా.. ఆ దర్శకుడు ఎవరంటే..