Oxygen Cylinder Blast: గ్యాస్ సిలెండర్ల ట్రక్ పేలుడు సీసీ టీవీ ఫుటేజ్.. నెట్టింట వైరల్ అవుతున్న బ్లాస్ట్ విజువల్స్

|

Sep 11, 2021 | 7:25 PM

ఈ నెల 7 వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు ఘటనకు సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Oxygen Cylinder Blast: గ్యాస్ సిలెండర్ల ట్రక్ పేలుడు సీసీ టీవీ ఫుటేజ్..  నెట్టింట వైరల్ అవుతున్న బ్లాస్ట్ విజువల్స్
Blast
Follow us on

Oxygen Cylinder Blast: ఈ నెల 7 వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు ఘటనకు సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మండపేట నియోజవర్గం ద్వారపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తోన్న టాటా ఏస్ ఉన్న ఫళంగా పేలుడుకు గురైన సంగతి తెలిసిందే. ఒక్క సారిగా దాదాపు పది ఆక్సిజన్ సిలెండరు గాల్లోకి ఎగిరాయి. ఉన్న ఫళంగా రోడ్డు మీద తెల్లటి పెద్ద పొగలు వ్యాపించాయి.

అదే సమయంలో రోడ్డు మీద లారీ, ఇద్దరు వాహన దారులు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తోన్న టాటా ఏస్ వాహనం దగ్గర్లోనే వెళ్తున్నారు. మండపేట రూరల్ ఎస్.ఐ బళ్ల శివ కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం టాటా ఏస్ వాహనంలో ఆక్సిజన్ సిలిండర్ లను తీసుకువస్తుండగా ద్వారపూడి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిపోయింది.

 

దీంతో వాహనం వెనుక వస్తున్న మోటార్ సైక్లిస్ట్ తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రుడిని పోలీస్ జీపులో అనపర్తి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. కాగా టాటా ఏస్ డ్రైవర్ పరారీ కాగా అతడ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఇదే ఆ షాకింగ్ వీడియో..

Read also: Chinta Mohan: దీపావళి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి : కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు