
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక స్పెషల్ రైళ్ల గురించి ప్రకటన విడుదల చేసింది. దీంతో వీటిల్లో ప్రయాణికులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఎక్కడ ఉన్నవారైనా సరే పండక్కి సొంతూళ్లకు వెళ్తాంటారు. ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో సొంతూరికి పయణమవుతారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల సందడితో కోలాహలం నెలకొంది. భారీగా రద్దీ ఏర్పడనున్న క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రత్యే రైలును ప్రకటించింది.
కాకినాడ నుంచి మైసూర్ మధ్య ప్రత్యేక వీక్లీ రైలును రైల్వేశాఖ ప్రకించింది. ఈ రైలు(07033) జనవరి 16 నుంచి 31 మధ్య సర్వీసులు అందించనుంది. ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు ఉదయం 9 గంటలకు కాకినాడలో బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 12 గంటలకు మైసూర్ చేరుకుటుంది. ఇక తిరుగు ప్రయాణంలో మైసూర్‌లో 17.20 గంటలకు బయల్దేరుతుంది. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, అనంతపురం, బెంగళూరు మీదుగా మైసూర్‌కు చేరుకుంటుంది.
ఇక న్యూఇయర్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్–ఎల్‌టీటీ ముంబై ట్రైన్ ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ నుంచి 17.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 10.40 గంటలకు ముంబై చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ముంబైలో 15.20 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్‌బుర్గి, సోలాపూర్, పూణె, కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతుంది.
🚉✨️SCR to run Christmas & New Year Special Trains🎊@RailMinIndia @AshwiniVaishnaw #FestivalSpecialTrains #Christmas #newyear pic.twitter.com/87loqnxYd7
— South Central Railway (@SCRailwayIndia) December 24, 2025