గాల్లో ఉండగానే నేలరాలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత.. అసలు మ్యాటరేంటంటే?

పక్కదేశాల నుంచి వలస వచ్చే అందమైన విదేశీ పక్షుల పాలిట యములవుతున్నారు కొందరు వేటగాళ్లు. చెరువుల దగ్గర కనిపించే స్వదేశీ, విదేశీపై పక్షులను తాపాకీలతో వేటాడుతున్నారు. నిబంధనలు బేఖాతరు చేసి ఇష్టారీతిన నాటు తుపాకులతో చేపల చెరువుల దగ్గర హల్ చల్ చేస్తున్నారు. వేటగాళ్ల వికృత చేష్టలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గాల్లో ఉండగానే నేలరాలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత.. అసలు మ్యాటరేంటంటే?
Migratory Birds Prakasam

Edited By:

Updated on: Jan 12, 2026 | 1:24 PM

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో చేపల చెరువుల దగ్గరకు ప్రతి ఏడాది నైజీరియా దేశం నుంచి పక్షులు వలస వస్తాయి. ఇక్కడ కొన్నాళ్లు సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అవుతాయి. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చిన పక్షులతో పాటు స్వదేశీ పక్షులపై కన్నేసిన కొందరు వేటగాళ్ళు.. వాటిని యథేచ్ఛగా వేటాడుతున్నారు. పక్షులపై తుపాకుల మోత మోగిస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసి ఇష్టారీతిన నాటు తుపాకులతో చేపల చెరువుల దగ్గర హల్ చల్ చేస్తున్నారు. తుపాకుల మోత, విదేశీ పక్షులను చంపేయడం వంటి వికృత చేష్టలతో స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకపక్క తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ పేరుతో పక్షుల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటుంటే.. మరోపక్క ప్రకాశం జిల్లాలో విదేశీ పక్షులను వేటాడి చంపేస్తున్నారు దుండగులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా జరుగుతున్న పక్షుల పండుగకు, భీములవారిపాళెం పడవలరేవుకు, నేలపట్టు పక్షుల కేంద్రానికి, అటకానితిప్ప వద్ద పులికాట్‌ సరస్సును తిలకించేందుకు ప్రజలు ఆశక్తిచూపిస్తుంటే.. ప్రకాశంజిల్లాలో మాత్రం వేటగాళ్ళు యధేచ్చగా నైజీరియా పక్షలు, స్వదేశీ పిట్టలను తుపాకులతో కాల్చి చంపేసి వండుకు తినేస్తున్నారు.

Migratory Birds Prakasam

ఇక్కడి చేపల చెరువుల నిర్వాహకులు పక్షులు చేప పిల్లలను తినేస్తున్నాయన్న సాకుతో వేటగాళ్లను రంగంలోకి దించారు. ఒంగోలు నుంచి ప్రత్యేకంగా వేటగాళ్లను రప్పించి, వారికి నాటు తుపాకులు ఇచ్చి పక్షులపైకి పంపుతున్నారు. చెరువు గట్లపై నిలబడి ఆకాశంలో ఎగిరే పక్షులను కాల్చి పడేస్తున్నారు. రోజువారీగా వందలాది పక్షులు ఈ వేటగాళ్ల తూటాలకు బలైపోతున్నాయి. వీటిలో నైజీరియా నుంచి వలస వచ్చిన విదేశీ పక్షలు, కొంగలు, స్వదేశీ పిట్టలు ఉన్నాయి. ఈ తుపాకుల శబ్దాలతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

ఎప్పుడు ఏ తూటా ఎటు నుంచి వచ్చి తమకు తగులుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారు. గతంలోనూ ఇక్కడ వలస పక్షులను కాల్చి చంపిన దాఖలాలు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ వేటగాళ్లు చెలరేగిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, తుపాకులను స్వాధీనం చేసుకుని, ఈ అక్రమ వేటను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.