
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కోట్ల రూపాయల నగదు నిల్వ వ్యవహారం కలకలం రేపింది. అందులోనూ ఒక సామాన్య పాస్టర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. నిల్వ ఉంచిన డబ్బుకు లెక్కలు లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ పాస్టర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ చూసేసరికి పోలీసుల కళ్లు చెదిరాయి .వీరికి కోట్ల రూపాయలు ఎక్కడివి.? హైదరాబాద్‌లో వీరి వ్యాపారం ఏంటి.? అనే దానిపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పీచుపాలెంలో నివాసం ఉంటున్న పాస్టర్ ఘంటా జాన్ బాబూరావు ఇంట్లో ఈ నగదు దొరికింది. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. లెక్కలలో లేని రూ. 2.27 కోట్లు గుర్తించారు. నగదుపై పాస్టర్ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం అనధికార నగదు రూ. 50 లక్షలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటికి రాగానే దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేయగా మిగతా నగదు దొరికింది. నగదు గురించి పొంతన సమాధానాలు చెప్పడంతో పాస్టర్ జాన్ బాబూరావు, శాంసన్‌లపై కేసు నమోదు చేసి.. వీరికి ఈ నగదు ఎలా వచ్చింది.? ఎక్కడి నుంచి వచ్చింది.? వీరి కుటుంబ సభ్యుల వ్యాపారాలుపై పోలీసులు విచారణ చేపట్టారు. నగదును ఐటి శాఖకు అప్పజెప్పనున్నట్లు రూరల్ సిఐ దుర్గప్రసాద్ తెలిపారు. ఈ నగదు మార్పిడిలో హవాలా కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది చదవండి: ధోని, కోహ్లీ, రోహిత్ ‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 సిక్సర్లతో తొక్కుకుంటూ పోతున్న సర్పంచ్ సాబ్..