
సాధారణంగా మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కొంతమంది దీన్నే ఉయ్యాల పండుగ అంటారు. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు. అయితే తాజాగా ఓ లేగదూడకు బారసాల నిర్వహించారు. ఈ వినూత్న ఘటన హనుమాన్ జంక్షన్‌లో వెలుగుచూసింది.
నందిగాం వెంకట నారాయణ, లలిత దేవిలకు పశు పోషణ అంటే మహా ఇష్టం అట. నాలుగేళ్ళ క్రితం 30 వేలకు పుంగునూరు ఆవును కొని ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. ఈ ఆవుకు ఒకసారి గిత్త దూడ పుట్టగా.. రెండో సారి పెయ్య దూడ పుట్టింది. దీంతో ఎంతో ఆనందంతో ఆ పెయ్య దూడకు ఉయ్యాల వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. 22 రోజులకు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిపారు. ఉదయాన్నే దూడకి స్నానం చేయించి కొత్త చీర అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో పేయ్య దూడను ఉంచి గౌరీ అని నామకరణం చేశారు ఆ దంపతులు. ఒక చిన్నారికి ఏ రకంగా వేడుక చేస్తారో అదేవిధంగా వేడుక నిర్వహించడం చూసి స్థానికులు ఆసక్తిగా చూసారు.
దేశీయ గోవులను సంరక్షిచడం.. వాటి సంతతిని పెంపొదించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆ దంపతులు పిలుపునిచ్చారు.ఎక్కడా లేని విధంగా దంపతులు ఓ లేగదూడకు బారసాల చేసి.. మూగజీవాలపై ప్రమేను చాటి చాటడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..