Andhra: మహిళను వేధించిన కేసులో ఇరుక్కున మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్సనల్ సెక్రెటరీ

ఏపి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అడిషనల్ పీఎస్ సతీష్‌పై కేసు నమోదు అయిన వ్యవహారం సంచలనం రేపుతుంది. సతీష్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనను రాజకీయ లబ్ధి కోసం ఇరికిస్తారని మంత్రి సెక్రటరీ ఆరోపించడంతో రాజకీయ దుమారునికి తెరలేపింది. ఇంతకీ అసలు మంత్రి సెక్రెటరీపై మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? తనపై వచ్చిన ఫిర్యాదు పై మంత్రి సెక్రటరీ ఏమంటున్నాడో తెలుసుకుందాం... 

Andhra: మహిళను వేధించిన కేసులో ఇరుక్కున మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్సనల్ సెక్రెటరీ
Satish harassment allegations

Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2025 | 9:59 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్సనల్ సెక్రెటరీ సతీష్‌పై కేసు నమోదైన ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఓ మహిళ ఎస్పీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మన్యం జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాలతో సతీష్‌పై కేసు నమోదు చేశారు. సతీష్ ఉద్యోగం పేరుతో ఐదు లక్షలు డబ్బు తీసుకొని మోసం చేశారని, తనపై వేధింపులకు పాల్పడినట్టు, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించినట్టు, తనను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం సతీష్‌పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర విచారణ చేస్తున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు కరెక్టేనా? మహిళా వద్ద ఉన్న ఆధారాలు నిజమా? లేక కల్పితమా? అన్న అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

త్రివేణికి మద్దతుగా ఐద్వాతో పాటు పలు మహిళ సంఘాలు అండగా నిలవడంతో త్రివేణి మరింత ఆందోళన ఉదృతం చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పర్సనల్ సెక్రెటరీ సతీష్ స్పందించాడు. సాలూరులో టిడిపి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై రాజకీయ దురుద్దేశంతో కావాలనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని వాస్తవాలు వెలుగుదీసి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇరువురు ఫిర్యాదుల ప పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ తీసుకావడంతో ఆమె వద్ద ఉన్న వాట్సాప్ చాట్, కాల్ డేటా, పలు వీడియోలు సేకరించారు. తదుపరి విచారణలో త్రివేణి ఇచ్చిన ఆధారాలు సరైనవేనా? ఏమైనా మార్పింగ్ జరిగిందా? ఇతర సాక్ష్యాలు, కాల్ డేటా, సంబంధిత సమాచారాన్ని పరిశీలిస్తున్నారు.

మంత్రి పర్సనల్ సెక్రెటరీ వ్యవహారం కావడంతో రాజకీయ దుమారం రేపుతుంది. మంత్రిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వైసిపి మాత్రం సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సతీష్‌పై చర్యలు తీసుకునే వరకు వెనకాడేది లేదని మహిళ నేతలు చెబుతున్నారు. అయితే రాజకీయ రంగు పులుకున్న ఈ కేసు రాజకీయంగా ఎంత దూరం వెళుతుందో? విచారణ తర్వాత నిజాలు ఏఏ బయటకు వస్తాయో? చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ వ్యవహారం పై ఇప్పటివరకు మంత్రి సంధ్యారాణి మాత్రం స్పందించలేదు. అయితే తన పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన కారణంగా మంత్రి సంధ్యారాణికి కానీ, ప్రభుత్వానికి కానీ ఎలాంటి సమస్య రాకూడదని రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా పత్రాన్ని మంత్రి సంధ్యారాణికి పంపించారు.  ఓవరాల్ ఈ ఘటన పై మంత్రి సంధ్యారాణి ఎలా స్పందిస్తుందో? అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.