నెల్లూరు: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ సర్జన్ చేస్తోన్న ఆమె ఉన్నట్టుండి హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీలో ఆదివారం (జులై 2) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య (23) అనే వైద్య విద్యార్థినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె నెల్లూరులోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ హౌస్ సర్జన్ చేస్తోన్న ఆమె ఆదివారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతికి మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.