Andhra: మొదట వలలో మంచిగానే చేపలు పడ్డాయ్.. మళ్లీ వేయగా.. ఈ సారి.. అమ్మ బాబోయ్

ఏపీలోని సముద్ర ప్రాంతాల్లో చేపల వేట నిషేధం ఉండటంతో.. స్థానికంగా నీరు ఉండే జలాశయాలు, వాగుల్లో చేపలు పడుతున్నారు జాలర్లు. అయితే చేపల వేటకు వల వేసిన సందర్భాల్లో కొన్నిసార్లు వింత జీవులు వలల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

Andhra: మొదట వలలో మంచిగానే చేపలు పడ్డాయ్.. మళ్లీ వేయగా.. ఈ సారి.. అమ్మ బాబోయ్
Fishing (Representative image )

Edited By:

Updated on: Apr 24, 2025 | 6:41 PM

ఆంధ్రాలోని జాలర్లకు ఇప్పుడు చాలా టఫ్ టైం. చేపల పునరుత్పత్తి సమయం కావడంతో వేటపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఆంక్షలు ఉల్లంఘించి ఎవరైనా వేటకు వెళ్తే.. కఠిన చర్యలు తీసుకుంటుంది.  దీంతో చిన్న, చిన్న కొలనుల్లో, చెరువుల్లో చేపలు పడుతున్నారు జాలర్లు. ఏదో రోజు భుక్తి కోసం నాలుగు పట్టినట్లు ఉంటుంది. అలానే రోజు కూడా గడిచిపోతుంది. అయితే చేపల కోసం వల వేస్తే కొన్నిసార్లు వింత, వింత జీవులు వలల్లో చిక్కుతూ ఉంటాయి. అలాంటి ఘటనే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వేముల పాలెంలో చోటుచేసుకుంది.  చేపల కోసం వల వేస్తే ఏకంగా భారీ పాము చిక్కడంతో జాలర్లు కంగుతిన్నారు. భయాందోళనతో  అక్కడి నుంచి పరుగులు తీశారు.

Python

సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉండటంతో.. వేముల పాలెం సమీపంలోని సుబ్బారాయుడు సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లారు జాలర్లు. తొలుత సాగర్‌లో వల వేయగా మొదట మంచిగానే చేపలు చిక్కాయి. ఇక్కడి వరకు అంతా ఓకే. ఇంకొన్ని చేపల కోసం మళ్లీ వల వేశారు. కాసేపటికి వల బరువుగా అనిపించడంతో.. పైకి లాగే ప్రయత్నం చేశారు. అయితే అలా లాగుతుండగానే వలలో దాదాపు 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో షాకయ్యారు. తొలత భయంతో వలను వెనక్కి వదిలేశారు. తర్వాత అంత ఖరీదైన వలని వదిలిపెట్టడం ఇష్టం లేక.. భయంభయంగానే కొండచిలువను వల నుంచి తప్పించి బయటకు తీశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..