గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మమత.. మంగళగిరి భార్గవపేటకు చెందిన చరణ్ కుమార్ లు ప్రేమించుకొని.. ఏడేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు.. ఆ దంపతులకు ఓ మూడేళ్ల క్రితం ఓ పాప పుట్టింది.. అప్పటి వరకు సజావుగానే సాగిన వారి కాపురంలో ఊహించని వ్యాధి కారణంగా చిచ్చురేగింది.. మమతకు పాప జన్మించిన సమయంలో రక్తపరీక్షలు చేయగా.. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. అదే సమయంలో ఆమె భర్త చరణ్ కు హెచ్ఐవీ నెగెటివ్ గా వచ్చింది.. దీంతో తనకు తన భర్తతో తప్ప.. ఎవరితో ఎఫైర్ లేదని.. అలాంటప్పుడు తనకు ఆ వ్యాధి ఎలా సోకిందనే విషయంపై అనుమానం వ్యక్తం చేసింది.. ఇది ఎలా జరిగి ఉండవచ్చని.. తన భర్తను అడిగింది.. అయితే.. భార్యకు రోగం వస్తే.. ఖంగారు పడాల్సిన చరణ్.. కాస్తా.. భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. ఆమె వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో అంగన్ వాడీ కేంద్రం ద్వారా సోకి ఉండొచ్చని మాయమాటలు చెబుతూవచ్చాడు.. భర్తపై నమ్మకం ఉంచిన భార్య మమత.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది..
అప్పటి నుంచి తనకు హెచ్ ఐవీ సోకడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది.. ఈ క్రమంలో భర్త చరణ్ లో మార్పును గమనించింది మమత.. తన భర్త మరొక యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకుని షాక్ కు గురైంది.. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కాబట్టి.. చరణ్ వ్యవహారంపై కాస్తా సీరియస్ అయింది.. అంతేకాదు.. తనను కాదని.. మరొక యువతితో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావంటూ ప్రశ్నించినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. అప్పుడే మొదలైంది మమతలో మరో కొత్త ఆలోచన… అదే తన భర్త మరొక యువతి కోసమే.. తనను వ్యాధి గ్రస్తురాలిని చేసి.. వదిలించుకొని.. తనకు నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉండేందుకు కుట్ర పన్నాడని అనుమానించింది.. మమతకు ఎలాంటి సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్న చరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ప్రేమ, పెళ్లి అంటూ తన జీవితాన్ని నాశనం చేసి.. మరొక యువతితో ఎఫైర్ సాగిస్తున్నాడని.. ఎంతో ఆరోగ్యంగా ఉండే తనను.. హెచ్ ఐవీ బాధితురాలిని చేసి.. అతను మాత్రం సుఖమయ జీవితాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తోంది మమత.. తనకు హెచ్ఐవీ సోకవడానికి కారణం ఏంటి..? తాను అనారోగ్యంగా ఉన్న సమయంలో తన భర్తనే ఒక ఆర్ఎంపీ వైద్యుడి సహాయంతో హెచ్ఐవీ వైరస్ ను తన శరీరంలోకి ప్రవేశపెట్టించాడని.. తన జీవితాన్ని సర్వనాశనం చేశాడని .. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మమత తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది..
మమత ఫిర్యాదు మేరకు చరణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. మమత శరీరంలోకి పక్కా ప్లాన్ తోనే హెచ్ఐవీ వైరస్ ను ఎక్కించాడా..? లేక ఏదైనా ప్రమాదవశాత్తు గానీ.. ఆమెకు హెచ్ ఐవీ సోకిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.. చరణ్ కు మరొక యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. దీంతో.. మమతకు హెచ్ఐవీ సోకిన విషయంలో కుట్ర ఏదైనా ఉందా..? అనే విషయాన్ని ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ను చేపట్టారు..
ఇదిలా ఉండగా.. బాధితురాలు మమత తల్లిదండ్రులు, బంధువులు చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తన సుఖం కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాడంటూ.. ఇలాంటి నీచుడిని అత్యంత కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. అలాగే మమతకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..