మదనపల్లె జంట హత్యల కేసులో నిందుతులిద్దరూ డెల్యూషన్స్ అనే మానసిక వ్యాధితో భాదపడుతున్నట్టుగా మానసిక వైద్యురాలు రాధిక రిపోర్ట్ ఇచ్చింది. ఈ మేరకు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించడానికి అనుమతి ఇవ్వాలని సబ్ జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ కోర్టును కోరారు. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత నిందితులను రుయా ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. పద్మజ, పురుషోత్తంలకు మానసిక విభాగంలో చికిత్స అందించనున్నట్లుగా తెలుస్తోంది. మూఢ భక్తితో కూతుళ్లను మూడు రోజుల క్రితం డంబెల్స్‌తో కొట్టి హత్య చేశారు పద్మజ, పురుషోత్తం నాయుడు.