Andhra Weather: మరో బాంబ్ పేల్చిన అమరావతి వాతావరణ కేంద్రం.. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు..!

శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి 48 గంటల్లో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది తుఫాన్‌గా బలపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ...

Andhra Weather: మరో బాంబ్ పేల్చిన అమరావతి వాతావరణ కేంద్రం.. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు..!
Weather Report

Updated on: Nov 20, 2025 | 1:50 PM

22 నవంబర్ 2025న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నవంబర్ 24 నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలలో వాయుగుండంగా బలపడనుంది. ఆపై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారి..  ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.  దీని ప్రభావంతో నవంబర్ 26 నుంచి 29 మధ్య కాలంలో తీరప్రాంత ఆంధ్రప్రదేశ్,  రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  26వ తేదీన ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు… 27, 28 తేదీల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 29న ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30వ తేదీన కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని..  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక గురువారం (20-11-2025) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.