
అక్రమ సంబంధం పెట్టుకున్నాడని లింగమూర్తిని చితక్కొట్టిన సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ(మం) మండగిరికి చెందిన రంగమ్మ(36) దేవనకొండ(మం) భైరవానికుంటకు చెందిన గొల్ల లింగమూర్తి మధ్య పది సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య మూడు పర్యాయలుగా పంచాయతీ జరిగింది. లింగమూర్తి, రంగమ్మ మధ్య అక్రమ సంబంధం వద్దని కుటుంబం సభ్యులు రంగమ్మ భర్త నాగేంద్రకు చెప్పినప్పటికి.. రంగమ్మ, లింగమూర్తిలు వినిపించకోకపోవడం.. మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించడం చేశారు.
పత్తికొండలో ఓ ఇంట్లో లింగమూర్తి, రంగమ్మలు ఇద్దరు కలసి ఉండగా భర్త నాగేంద్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని లింగమూర్తిని చితకబాదారు. కుళ్లబొడిచారు. వద్దని చెప్పినా వినవా అంటూ చావగొట్టాడు. గాయాలపాలైన గొల్ల లింగమూర్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు చికిత్స అనంతరం గొల్ల లింగమూర్తి చనిపోయాడు. లింగమూర్తి తండ్రి గొల్ల చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు 6 మందిపై పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అటు బోయ రంగమ్మ కుటుంబంలో ఇటు గొల్ల లింగమూర్తి కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. అక్రమ సంబంధంతో రంగమ్మకు ఒక కుమారుడు ఓ కుమార్తె, లింగమూర్తి కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు.