వేరే ఊరి వారికి పిల్లనివ్వం.. చేసుకోం.. విజయనగరంలో ఓ గ్రామం స్పెషాలిటీ!

| Edited By: Srinu

Nov 21, 2019 | 5:14 PM

విజయనగరం మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చెందిన వారంతా .. అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన వారితోనే జీవితాలను పంచుకుంటున్నారు. అనాదిగా అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అది విజయనగరం జిల్లా జామి మండలం లొట్లపల్లి గ్రామం. లొట్లపల్లిలో సుమారు ఒక వెయ్యి మంది జనాభా ఉంటారు. తాతలకాలం నుంచి కూడా గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఇతర గ్రామాల, ప్రాంతాల సంబంధాలు చేసుకోడానికి ఇష్టపడరు. […]

వేరే ఊరి వారికి పిల్లనివ్వం.. చేసుకోం.. విజయనగరంలో ఓ గ్రామం స్పెషాలిటీ!
Follow us on

విజయనగరం మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చెందిన వారంతా .. అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన వారితోనే జీవితాలను పంచుకుంటున్నారు. అనాదిగా అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అది విజయనగరం జిల్లా జామి మండలం లొట్లపల్లి గ్రామం.

లొట్లపల్లిలో సుమారు ఒక వెయ్యి మంది జనాభా ఉంటారు. తాతలకాలం నుంచి కూడా గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఇతర గ్రామాల, ప్రాంతాల సంబంధాలు చేసుకోడానికి ఇష్టపడరు. పిల్లలకు వివాహ వయస్సు వచ్చేసరికి కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు సమావేశమై ఇద్దరినీ ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తారు. వివాహాలు చేసుకున్నవారు పెద్దలమాట జవదాటరు. మేనత్త కూతుళ్లు, అక్క కూతుళ్లను వివాహం చేసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దగ్గరి సంబంధాలు దొరక్కపోతే ఇతర కుటుంబాల్లో వరస అయ్యేవారిని చేసుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటి సంబంధాలు చేసుకుంటారు.

ఆ ఊరివారినే చేసుకుంటే కుటుంబాలు బలపడతాయని, వ్యవసాయం లేదా ఇతర పనులు చేసుకోటానికి వీలుంటుందని వారి నమ్మకం. ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని వారి నమ్మకం. ఆస్తులు కూడా బయటి వారికి పోకుండా అవే కుటుంబాల మధ్య ఉంటాయని… పిల్లలు కూడా తమ కళ్లముందుంటారని ఆ గ్రామస్తుల ఉద్దేశం. ఈ గ్రామంలో దగ్గర సంబంధాలు చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండటం విశేషం.