AP Rains: మాయదారి వర్షం ఆగేలా లేదు.. ఏపీకి వచ్చే 3 రోజులు కూల్ న్యూస్.. వానలే వానలు

ఏపీని వర్షాలు వీడట్లెదు. మరో మూడు రోజులు కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజాగా వెదర్ రిపోర్ట్ ప్రకటించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

AP Rains: మాయదారి వర్షం ఆగేలా లేదు.. ఏపీకి వచ్చే 3 రోజులు కూల్ న్యూస్.. వానలే వానలు
Weather Report

Updated on: Apr 05, 2025 | 2:32 PM

దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర తమిళనాడు వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:-
—————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు, ఎల్లుండి:-
————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
———————————

ఈరోజు:-
—————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు ౩౦-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు, ఎల్లుండి:-
—————————–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

రాయలసీమ:-
———————————–

ఈరోజు:-
—————

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు, ఎల్లుండి:-
—————————–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాగాల నాలుగు రోజుల్లో క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది. రాయలసీమలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు లేదు. తదుపరి రోజుల్లో స్వల్పంగా పెరిగే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి