AP News: భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?

| Edited By: Ravi Kiran

Oct 26, 2024 | 9:24 PM

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూడాలని ఉందా.. అయితే ఈ అవకాశం మీ కోసమో.. విశాఖలో లేజర్ షో వేయనున్నారు... అస్సలు మిస్ చేయకండి.. మళ్లీ ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలీదు.. ఇంతకీ విశాఖలో లేజర్ షో ఎక్కడో తెలుసా..!

AP News: భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?
Laser Show In Visakhapatnam
Follow us on

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు.. లేజర్ షో..ఎక్కడో తెలుసా..! అస్సలు మిస్ చేయకండి..లేజర్ షో ఎక్కడో తెలుసా..!అది 1971 వ సంవత్సరం..భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం.. యుద్ధ వీరుల సాహసాలు.. అంటే చరిత్ర.. విశాఖ నగర ఘనత.. అన్ని మీ కళ్ళ ముందుకు.. అది కూడా సుందర సాగర తీరంలో.. ఆ ప్రదర్శన కూడా ఎక్కడో కాదు.. భారత్ పాక్ యుద్ధం విజయానికి ప్రతికగా బీచ్ రోడ్లో నిర్మించిన విక్టరీ ఎట్ సీ స్తూపం పైన లేజర్ షో నిర్వహించనున్నారు.

జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 27 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి బీచ్ రోడ్డులో వైఎంసీఎ సమీపాన గల ” విక్టరీ ఎట్ సీ ” స్థూపంపై సౌండ్ అండ్ లేజర్ షో వేస్తున్నారు. ఈ లేజర్ షోలో 1971 నౌకాదళం యుద్ధం, విశాఖ నగరం పాత్ర, యుద్ధ వీరుల సాహసాలతో పాటు దేశ చరిత్రను తెలిపే విధంగా అద్భుతమైన లేజర్ షో నిర్వహిస్తారు. ఇప్పటికే సెప్టెంబర్ రెండవ తేదీన ట్రయల్ రన్‌గా ” విక్టరీ ఎట్ సీ” స్తూపంపై ఈ లేజర్ షోను ప్రదర్శించారు. ఇకపై ప్రతి ఆదివారం ప్రజల వీక్షనార్థం ప్రదర్శించడం జరుగుతుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 27, 2024 ఆదివారం సాయంత్రం 7 గంటలకు బీచ్ రోడ్డులో వైఎంసిఏ సమీపానగల విక్టరీ ఎట్ సీ స్థూపం పై ఈ లేజర్ షోను ప్రదర్శిస్తున్నారు. ప్రజలందరూ ఈ అద్భుతమైన ప్రదర్శనను తిలకించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తెలిపారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి