AP IAS Officer: ఆమె ఎందరికో ఆదర్శం.. కొడుకును ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో జాయిన్‌ చేసిన ఐఏఎస్‌..

|

Jul 26, 2022 | 9:34 PM

ఈమె కుమారుడు శ్రీకర్‌ ప్రతీక్‌. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని మల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్‌లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

AP IAS Officer: ఆమె ఎందరికో ఆదర్శం.. కొడుకును ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో జాయిన్‌ చేసిన ఐఏఎస్‌..
Ap Ias Officer
Follow us on

AP IAS Officer: జిల్లా కలెక్టర్‌ పిల్లలు అంటే.. వారి తల్లిదండ్రులకు తగ్గటుగా అదే హోదా మెయిన్‌టెన్‌ చేస్తుంటారు చాలా మంది..కానీ, ఇటీవల కాలంలో కొందరు అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఐఏఎస్‌ తన కుమారుడిని ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో జాయిన్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ (ఐటీడీఏ) ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా బీ నవ్య పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు శ్రీకర్‌ ప్రతీక్‌. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని మల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్‌లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

ఏపీ సర్కార్‌ విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన వసతులు ఉన్నాయని ఐఏఎస్‌ అధికారిణి బీ నవ్య తెలిపారు. తాను కూడా గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూళ్లోనే చదువుకుని ఐఏఎస్‌ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఇలా ఐఏఎస్‌లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తుండటంతో ప్రజలు వారిని అనుసరిస్తున్నారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి