Kurnool: నిర్లక్ష్యం నీడలో.. నిద్ర మత్తులో.. క్రీడా ప్రాధికార సంస్థ.. క్రీడాకారులకు నరకం

జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతితో సత్కరించాలని 2019 లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది

Kurnool: నిర్లక్ష్యం నీడలో.. నిద్ర మత్తులో.. క్రీడా ప్రాధికార సంస్థ.. క్రీడాకారులకు నరకం
Kurnool Sports Authority

Updated on: Oct 02, 2021 | 10:46 AM

Kurnool District Sports Authority: జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతితో సత్కరించాలని 2019 లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జాతీయస్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన వారికి 1.5 లక్షలు, వెండి పతకం సాధించిన వారికి లక్ష రూపాయలు, కాంస్య పతకం సాధించిన వారికి 50 వేల రూపాయలను నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కర్నూలు జిల్లాలో 76 మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో 116 పథకాలను సాధించి కీర్తి ప్రతిష్టలను అందించారు. వీరందరికీ ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. కానీ కర్నూల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ లో ఇద్దరు అధికారుల మధ్య విభేదాల కారణంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శాపంగా మారింది. ఇంతవరకు ఊ నగదు బహుమతులు ఇవ్వలేదు. దీంతో విడుదల అయిన డబ్బులు వెనక్కి వెళ్ళి పోయే అవకాశం ఉంది.

ఇదే విషయంపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దృష్టికి బాధిత క్రీడాకారులు తీసుకెళ్లారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఇద్దరు అధికారుల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు అధికారుల పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్ అయినట్లు తెలిసింది.

దీంతో వారం రోజుల లోపే అర్హులైన క్రీడా ఆణిముత్యాల కు నగదు పురస్కారాలు అందజేస్తామని అధికారులు అంటున్నారు. వేదాలు కారణం చెప్పకుండా సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అయిందని అంటున్నారు. కాగా, తమ భవిష్యత్తు పై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అనే భయంతో క్రీడాకారులు ఎవరూ కూడా బహిరంగంగా ముందుకు వచ్చి దీనిపై చెప్పడం లేదు.

Read also: Gold Cheating: వెండి ఉంగరాలకు బంగారు పూత.. హల్ మార్క్ గుర్తు. 200 మంది దగ్గర తాకట్లు.. @6 కోట్లు