Andhra Pradesh: కర్నూలు కొండారెడ్డి బురుజు దశ తిరగబోతుంది

|

Sep 27, 2021 | 8:19 AM

కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర సినిమాలోని ఏదో ఒక సీన్ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ఇందులో భాగంగానే హీరో మహేష్ బాబు సినిమాల్లోని....

Andhra Pradesh: కర్నూలు కొండారెడ్డి బురుజు దశ తిరగబోతుంది
Konda Reddy Buruju
Follow us on

కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర సినిమాలోని ఏదో ఒక సీన్ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ఇందులో భాగంగానే హీరో మహేష్ బాబు సినిమాల్లోని పలు సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. ప్రజంట్ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అచ్చం కొండారెడ్డి బురుజు లాగానే ఫిలింసిటీలో సెట్ నిర్మించి.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సీన్స్ తీశారంటే వారి నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు ఇక నుంచి పర్యాటక ప్రాంతం కానుంది. మరింత ఆధునికంగా, అందంగా రూపు దిద్దుకోనున్నది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొండారెడ్డి బురుజు చుట్టూ వలయంలా రోడ్లు నిర్మించనున్నారు. కొండారెడ్డి బురుజును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కల్చర్ ఫండ్ నుంచి 94 లక్షల రూపాయలు విడుదల చేయించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి.

త్వరలోనే పనులు మొదలు పెట్టి కొండారెడ్డి బురుజును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. కొండారెడ్డి బురుజు కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కోట. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. ఎర్రని ఇసుకరాయితో నిర్మించడం వలన దీనిని ఎర్ర బురుజు అని కూడా అంటారు. ఇందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు.

Also Read:  నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కానీ

అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్