Python in Anantapur: కొండచిలువ (Python) అడవులను వదిలి.. జనావాసాల బాట పట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అనంతపురం(Anantapur) జిల్లాలో కొండచిలువ కనిపించి మనుషులను భయబ్రాంతులకు గురు చేసింది. జిల్లాలోని గోరంట్ల మండలంలో మినీ అనకొండ(కొండచిలువ) కలకలం సృష్టించింది.
యమకలగుట్టపల్లి గ్రామం సమీపంలో ఈ కొండ చిలువ గొర్రెలను మాయం చేస్తోంది. మంగళవారం రోజున ఈ మినీ అనకొండ గొర్రెల తన శరీరంతో చుట్టి తింటుండగా.. గ్రామస్థులు ప్రత్యక్షంగా చూశారు. దీంతో గొర్రెల కపరులతో పాటు గ్రామస్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత పెద్ద కొండచిలువ ఎక్కడి నుంచి తమ గ్వరామంలోకి వచ్చిందో తమకు అర్ధం కావడం లేదని గ్రామస్థులు చేనుతున్నారు. మనుషులకు ఈ కొండ చిలువ హాని చేయకముందే.. అటవీశాఖ అధికారులు స్పందించి.. దానిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కొండ చిలువ విషరహితమైన పెద్ద పాము. ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. కొన్ని సార్లు మనుష్యులను కూడా ఇవి మింగిన సందర్భాలున్నాయి. సహారా ఎడారుల్లో ఆసియా దేశాలైన పాకిస్థాన్, భారతదేశం, శ్రీలంక,, నికోబార్ దీవులు తదితర మలయా ప్రాంతాల్లో ఎక్కువగా కొండచిలువలు కనిపిస్తాయి.
Also Read: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం..