
చమురు బావుల డ్రిల్లింగ్ దగ్గర, రిపేర్లు జరిగేటప్పుడు ఒత్తిడి అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పెనలా గ్యాస్ బయటకొస్తే, దాన్నే కదా బ్లో-అవుట్ అంటాం..? కోనసీమలో రిపీటెడ్‌గా వినిపించే మాట ఇది. బ్లోఅవుట్ కారణంగా ఇప్పటివరకూ ప్రాణనష్టమైతే జరగలేదు. కానీ, జీరో కాజువాలిటీస్ అని తేలిగ్గా తీసుకోడానికీ లేదు. ఎందుకంటే, అలా బయటికొచ్చిన గ్యాస్‌ని ఎంత వీలైతే అంత తొందరగా మంటగా మార్చడమో, కౌంటర్ కెమికల్స్‌ని వాడి అదుపులోకి తేవడమో చేయాలి. లేకపోతే, గ్యాస్ ఒక్కటే గాల్లోకి చేరిపోయి చిన్నసైజు మేఘంలా ఏర్పడితే.. వెరీ డేంజరస్. ఈ పరిణామం ఎంతటి ప్రమాదకరం అంటే, ఆ గ్యాస్ క్లౌడ్ రాజుకుని పేలితే, ఒక బాంబు విస్ఫోటనంలా మారుతుంది. దాని ప్రభావం ఉన్నంతవరకూ పరిసరాల్లో జనం, ఇళ్లు, గొడ్డుగోదా అన్నీ అంటుకుంటూనే ఉంటాయి. దావానలంలా కొన్ని నెలల పాటు మండుతూనే ఉంటుంది. ఇంతవరకూ ఐదారు బ్లో-అవుట్‌లను భరించిన కోనసీమ ఇటువంటి ఘోరాన్నయితే చవిచూడలేదు.. థ్యాంక్‌గాడ్. కానీ, బ్లోఅవుట్‌ని సరైన పద్ధతుల్లో డీల్ చెయ్యకపోయినా, చిన్న ఏమరుపాటు జరిగినా పరిస్థితి విషమించినట్టే. బ్లోఅవుట్ వికటిస్తే ఎంత ప్రమాదకరమో అర్థమైందిగా? దీనికితోడు చాలా రొటీన్‌గా మారి, పదులకొద్దీ ప్రాణాల్ని తోడుకెళ్తున్న గ్యాస్‌లీకులది వేరే కథ. మరి, కోనసీమ కింద శక్తివంతమైన మందుపాతర అమర్చుకున్నట్టేగా? ఏ క్షణంలోనైనా కోనసీమ పేలి, కాలి బూడిదయ్యే ప్రమాదం ఉన్నట్టేగా? ...