
అరిసెలు, బూరెలు, వడలు, ఆవడ బొండలు, గజ్జికాయలు, కరకారలాడే జంతికలు, కమ్మని పులిహోర, గొంగూర ఇవన్నీ మన ఆంధ్రస్పెషల్ వంటకాలు.. ఇంతేనా అనుకునేరు.. ఇంతకుమించి ఇంకెన్నెన్నో ఉన్నాయి. అలాంటి రుచికరమైన, ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి మాత్రం బాగా ఫేమస్ అండోయ్.! దాని పేరు చెబితే చాలు.. మాంసం ప్రియులకు నోరూరుతుంది. ఏడాదికి రెండు నెలలు మాత్రమే దొరికే ఆ వంటకం అంటే.. తెలుగు రాష్ట్రాల్లో భోజనప్రియులకు ఫుల్లు క్రేజ్.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ వంట రుచి, వాసన తెలిసిన ప్రపంచ వ్యాప్త భోజన ప్రియులకు ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. ఇక ఆంధ్ర అల్లుళ్లకిచ్చే మర్యాద గురించి అయితే, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సీజన్ వచ్చిందంటే.. అల్లుడికి తప్పనిసరిగా ఆ వంట రుచి చూపిస్తారు. అబ్బా.. ఏంటి మీ సుత్తి..ఏదో వంటకం అంటూ తెగ నాన్చేస్తున్నారు.. అని విసుక్కుంటున్నారా..? ఆ వంటకం మరేంటో కాదండోయ్..పులస.. పుస్తెలమ్మి అయినా సరే.. పులస తినాల్సిందే..! అన్న మాట మనం చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.. కానీ, మనలాంటి వాళ్లం ఎన్నడూ చూసింది లేదు..నానుడి మాత్రం బాగానే ఫేమస్..అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండేది. ఉన్నంతలో బంగారమే కాస్ట్లీ కాబట్టి పుస్తెలమ్మీ అనే మాట వచ్చిందనుకుంటా.. కానీ, నేటి పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పులస నానుడికి అర్థాన్ని మార్చేశాయి పుత్తడి ధరలు.. కానీ, ఆ నాటి నానుడికి తగ్గటుగానే, ఇప్పటికీ పులస...