AP News: ఆహా.. ఏపీలో కేజీ చేపలు 10 రూపాయలకే.. లేట్ చేయకండి..

|

May 26, 2024 | 9:40 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రేటు అమాంత పడిపోయింది. కిలో చేప ధర 10 రూపాయలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రీజన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి....

AP News: ఆహా.. ఏపీలో కేజీ చేపలు 10 రూపాయలకే.. లేట్ చేయకండి..
Fish
Follow us on

అవును.. మీరు విన్నది నిజమే. పశ్చిమ గోదావరి జిల్లాలో అమాంతం పడిపోయింది చేపల ధర. కేజీ చేపలను పదిరూపాయలకే విక్రయించారు. జిల్లాలోని ఆకివీడు మార్కెట్ లో చేపలు ధరలు దారుణంగా పడిపొయాయి. మొన్నటి వరకూ కిలో 150 రూపాయలు వరకూ పలికిన చేప ధర ఇప్పుడు 10 నుండి 20 రూపాయలు పలుకుతున్నా కొనే వారులేక లబోదిబోమంటున్నారు రైతులు. వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో చేపలు తేలిపోతున్నాయి. చేపల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు చేపలను పట్టి భారీగా మార్కెట్ కు తరలిస్తున్నారు. ఒక్కసారి మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయింది. చేపల ధరల విషయంలోను వ్యాపారస్తులు చేతులెత్తేశారు.

పేరున్న బొచ్చె , శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క చేప కిలో నుండి ఐదు కిలోల వరకూ ఉన్నాయి. చేపలు కొనేవారు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పది ఎకరాలకు పైగా సాగుచేస్తున్న రైతులు కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..