Kanna Lakshminarayana: పురంధేశ్వరి టీడీపీలో చేరతారన్న వార్తల్లో నిజం లేదట.. క్లారిటీ ఇచ్చిన ఆ నేత..

|

Feb 23, 2023 | 1:21 PM

కొందరు బీజేపీ సీనియర్లు మాత్రం తనతో టచ్‌లో ఉన్నారన్నారని అన్నారు కన్నా లక్ష్మినారాయణ. 3వేల మందితో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశంలో పార్టీలో తాను చేరుతున్నట్టు ప్రకటించారు.

Kanna Lakshminarayana: పురంధేశ్వరి టీడీపీలో చేరతారన్న వార్తల్లో నిజం లేదట.. క్లారిటీ ఇచ్చిన ఆ నేత..
Kanna Lakshminarayana
Follow us on

తనతో పాటు బీజేపీ సీనియర్‌ నేత పురంధేశ్వరి తెలుగు దేశం పార్టీలో చేరతారన్న వార్తల్లో నిజం లేదన్నారు కన్నా లక్ష్మినారాయణ. అయితే కొందరు బీజేపీ సీనియర్లు మాత్రం తనతో టచ్‌లో ఉన్నారన్నారని అన్నారు కన్నా లక్ష్మినారాయణ. 3వేల మందితో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశంలో పార్టీలో తాను చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంలో 50మంది ముఖ్య నేతలకు చంద్రబాబు కండువా కప్పుతారన్నారు కన్నా లక్ష్మినారాయణ. గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అనుచరులు వస్తున్నట్టు తెలిపారు. కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. సీనియర్లు చాలామంది తనతో టచ్‌లో ఉన్నారనడంతో ఎవరనే దానిపై పార్టీలో చర్చ మొదలైంది.

ఇప్పటికే విష్ణుకుమార్‌ రాజుతో  కన్నా లక్ష్మినారాయణ సమావేశం కావడం.. మరికొంతమంది కూడా సోము, జీవీఎల్‌ పట్ల అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొందరి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినవాళ్లతో పాటు.. జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నేతలున్నారని భావిస్తున్నారు.

అటు ఏపీ బీజేపీలో పరిణామాలపై అధిష్టానం కూడా ఫోకస్‌ పెట్టింది. ఏపీ నేతలను ఢిల్లీకి పిలిపించినట్టు చెబుతున్నారు. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్‌ పిలుపుతో ఏపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అగ్రనేతలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారట కన్నా. అటు… కమలం పార్టీలో తిరుగుబాటు కన్నాతోనే ఆగిపోయే వాతావరణమైతే లేదు. సోమువీర్రాజుతో విబేధించి బైటికెళ్తున్నట్టు చెప్పిన కన్నాకు… పార్టీలోపల్నుంచి కూడా కొందరు నేతల నుంచి మద్దతుంది.

విశాఖ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా బీజేపీని వీడేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారముంది. కన్నా తిరుగుబాటు నేపథ్యంలో పురందేశ్వరి లాంటి సీనియర్లే ఎంపీ జీవీఎల్ మీద బహిరంగ విమర్శలు చేయడం… కమలం పార్టీకి ఒక సెట్‌బ్యాక్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం