Kadapa Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రతి రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలవుతున్నారు. మంగళవారం కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముద్దనూరు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యారు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో ముద్దనూరు నుంచి చిన్నదుద్యాల గ్రామానికి వెళ్తుండగా, పులివెందుల ప్రొద్దుటూరు తిరుగుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.