Andhra Pradesh: సమ్మెను విరమించిన జూనియర్ డాక్టర్ల జేఏసీ.. 15 శాతం స్టైఫండ్ పెంచడంపై అసంతృప్తి

|

Oct 23, 2022 | 9:47 AM

జూనియర్ డాక్టర్లు మాత్రం 42 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో కంటే ఇతర రాష్ట్రాలలో ఇచ్చే ఇచ్చే స్టైఫండ్ రెట్టింపు ఉన్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చెప్తున్నారు.

Andhra Pradesh: సమ్మెను విరమించిన జూనియర్ డాక్టర్ల జేఏసీ.. 15 శాతం స్టైఫండ్ పెంచడంపై అసంతృప్తి
Andhra Pradesh Jr. Doctors
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించింది. 15 శాతానికి స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దింతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించుకుంటూ జూనియర్ డాక్టర్ల జేఏసీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి స్టైఫండ్ పెంచాలని 17వ తేదీ నుండి జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మొదటి రోజు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రెండవ రోజు కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మూడవ రోజు వినతిపత్రాలకు గులాబీ పువ్వులతో కలిపి పోస్ట్ ధ్వారా సంబంధిత అధికారులకు పంపారు. దింతో శుక్రవారం ప్రభుత్వం స్పందించింది. స్టైఫండ్ 15 శాతం పెంచుతూ జీవో విడుదల చేసింది. దింతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.

అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఎంబీబీఎస్ బిడియస్ విద్యార్థుల కు ఇప్పటి వరకు 19589గా ఉన్న స్టైఫండ్ 22527 కు పెరుగుతుంది.పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కు 44075 ఉన్న స్టైఫండ్ 50686 రూపాయలకు పెరుగుతుంది. రెండవ సంవత్సరం వారికి 46524 రూపాయలుగా ఉన్నది 53503 కు పెరుగుతుంది. మూడవ సంవత్సరం వారికి 48973 గా ఉన్నది 56319 రూపాయలకు పెరుగుతుంది. పీజీ డిప్లొమా మొదటి సంవత్సరం వారికి 44075 ఉన్న స్టై ఫండ్ 50684కు పెరుగుతుంది. రెండవ సంవత్సరం వారికి 46524 గా ఉన్నది 53503కు పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి 48973 గా ఉన్నది 56319 కి పెరుగుతుంది. రెండవ సంవత్సరం వారికి 51422 గా ఉన్నది 56319 కి పెరుగుతుంది. మూడవ సంవత్సరం వారికి 5189 గా ఉన్నది 61949 కి పెరుగుతుంది. బిడియస్ మొదటి సంవత్సరం వారికి 44075 గా ఉన్నది 50686 కి పెరుగుతుంది. రెండవ సంవత్సరం వారికి 46524 గా ఉన్నది 53503కి పెరుగుతుంది. మూడవ సంవత్సరం వారికి 48973 గా ఉన్నది 56319 కి పెరుగుతుంది.

జూనియర్ డాక్టర్లు మాత్రం 42 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో కంటే ఇతర రాష్ట్రాలలో ఇచ్చే ఇచ్చే స్టైఫండ్ రెట్టింపు ఉన్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చెప్తున్నారు. దేశంలో ఉన్నా రాష్ట్రాలలో కంటే ఏపీలోని తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం పదిహేను శాతం పెంచడం పై కూడా జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము డిమాండ్ చేసిన 42 శాతం అమలు చేస్తేనే అన్ని రాష్ట్రాలతో సమానంగా స్టైఫండ్ చెప్తున్నారు. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె సమ్మె విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Reporter : sagar

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..