Janasena Formation Day: 20 ఏళ్ల దాకా ఇలాగే నిద్రలో కలవరిస్తూ ఉండండి! వైసీపీపై నాగబాబు సైటర్లు
పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. కొణిదెల నాగబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సభా వేదిక 250 మంది సామర్థ్యంతో, 1700 మంది పోలీసుల భద్రతతో, 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షించబడింది. నాగబాబు ప్రసంగం సభను ఉత్సాహపూరితంగా మార్చింది.
పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరుగుతున్న జనసేన జయకేతనం సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు హాజరైన మెగా బ్రదర్, జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. సినిమాలో కమిడియన్స్‌లా.. ఇక్కడ వైసీపీ వాళ్లు కామెడీ చేస్తున్నారని అన్నారు. ఇటీవలె కాళ్లు మూసుకుంటే 9 నెలల కాలం వెళ్లిపోయిందని, మరికొన్ని రోజులు కళ్లు ముసుకుంటే మిగిలిన టైమ్ అయిపోతుందని వైసీపీ నేత అంటున్నారని, మీరు అలాగే ఇంకో 20, 30 ఏళ్ల నిద్రపోతూ అప్పుడప్పుడు కలవరిస్తూ ఉండండి, మిమ్మల్ని ఎవరూ డిస్టబ్ చేయరంటూ సెటైర్లు పేల్చారు.
నాగబాబు మాట్లాడుతున్న సమయంలో సభ దద్దరిల్లిపోయింది. వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తుంటే.. అంతా చప్పట్లతో నాగబాబుకు మద్దతు తెలిపారు. ఈ సభ ఈ రోజు 4 గంటలకు ప్రారంభమైంది. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభ వద్ద ఏకంగా 1,700 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

