Pawan Meets Amit Shah: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దు.. కేంద్ర హోశాఖ మంత్రి భేటీలో పవన్‌ కల్యాణ్‌

|

Feb 09, 2021 | 11:27 PM

Pawan Meets Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలోనే అమిత్‌ షా, పవన్‌ కల్యాణ్‌, నాదేండ్ల ..

Pawan Meets Amit Shah: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దు.. కేంద్ర హోశాఖ మంత్రి భేటీలో పవన్‌ కల్యాణ్‌
Follow us on

Pawan Meets Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలోనే అమిత్‌ షా, పవన్‌ కల్యాణ్‌, నాదేండ్ల మనోహర్‌లు సమావేశం అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దంటూ పవన్‌ కల్యాణ్‌ వినతి పత్రం అందజేశారు. ఎంతో మంది పోరాటానికి చిహ్నం శాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని పవన్‌ కల్యాణ్ అన్నారు. 32 మంది త్యాగం ఫలితంగానే విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ అమిత్ షాతో అన్నట్లు తెలుస్తోంది. 18వేల మంది పర్మినెంట్‌, 20 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు, మరో లక్ష మంది ప్రజలు ఫ్యాక్టరీపై పరోక్షంగా ఆధారపడ్డారని అన్నారు.

ప్లాంట్‌ నష్టాలకు కారణం ముడిసరుకు లేకపోవడమే అని అమిత్‌షాతో పవన్‌ వివరించారు. రూ. 3వేల కోట్లకు నికర నష్టాలు అంచనా రూపొందించారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునః పరిశీలించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. గనులు కేటాయించి రుణభారాన్ని తగ్గించాలని పవన్‌ కల్యాణ్‌ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు.

కాగా, తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసహరించుకోవాలనే కేంద్రం నిర్ణయాన్ని పవన్ మార్చగలుగుతారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ లేఖ