డైలాగులు దంచుడు…పంచులు పేల్చుడు. అధికార వైసీపీపై నిప్పులు చెరుగుడు. పదునైన మాటలతో చెడుగుడు ఆడుకోవడం. ఇదీ భీమవరంలో పొలిటికల్ భీమ్లా నాయక్ స్పీచ్. టార్గెట్ వైసీపీ అంటూ డైలాగ్ డైనమైట్స్ పేల్చారు పవన్ కల్యాణ్. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వనంటూ గర్జించారు.
భీమవరంలో పవన్ మీటింగ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఓపెన్ టాప్ కారులో నుంచుని అభివాదం చేస్తూ అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు పవన్ కల్యాణ్. వారాహి యాత్ర మొదటి విడత ముగియడంతో ఈ సభ నిర్వహించారు. పవన్ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావడం అందరిని ఆకట్టుకుంది. జనసేన అధ్యక్షుడికి తమ మద్దతు ప్రకటించారు ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందున పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇస్తున్నామంటున్నారు వాళ్లు.
ఇదిలా ఉంటే తన స్పీచ్‌లో అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడితే వైసీపీ నేతలకు చెవులనుంచి రక్తం వస్తుందన్నారు పవన్. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే తాను కూడా అదే పని చేయగలనంటూ హెచ్చరించారు పవన్. సీఎం జగన్ హైదరాబాద్‌లో ఏం చేశారో, ఆయన మంత్రులు ఏం చేశారో అన్నీ తనకు తెలుసన్నారు జనసేన అధినేత. భీమవరంలో భీమ్లా నాయక్ స్పీచ్ అభిమానులు, కార్యకర్తల్లో జోష్ నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..