Pawan Kalyan: దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్, చిరాగ్ జోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం..

|

May 01, 2023 | 7:56 AM

బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా రికార్డులకెక్కింది. ఈ బాడ్మింటన్ క్రీడాకారుల జోడీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. 

Pawan Kalyan: దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్, చిరాగ్ జోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం..
Pawan On Satwik Chirag Pair
Follow us on

దుబాయ్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ కోర్టులో సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరద్దరూ కలిసి చరిత్ర సృష్టించారు. . 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ..  భారతదేశాన్ని ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా రికార్డులకెక్కింది.

ఈ బాడ్మింటన్ క్రీడాకారుల జోడీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.  బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఆసియా ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచి.. దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో డబుల్ విభాగంలో విజేతలుగా నిలిచిన తొలి భారతీయ జోడీ వీరిదే కావడం ప్రతి ఒక్కరం గుర్తించాలని చెప్పారు. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ బాడ్మింటన్ క్రీడలో సాధిస్తున్న విజయాలు మన తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయంటూ జనసేనాని ప్రశంసల వర్షం  కురిపించారు. సాత్విక్ విజయాలు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. సాత్విక్,  చిరాగ్ జోడీకి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..