
టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ జిల్లా టీడపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌కు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. 40 ఏళ్ళుగా పార్టీకి, ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి కృష్ణాజిల్లా కేడిసీసీ బ్యాంకు చైర్మన్ ఇవ్వడం ఆయన్ని అవమానించడమేని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుచరులు.
రఘురామ్‌కు అప్కాబ్ చైర్మన్ పదవి వస్తుందని ఆశించామనన్నారు నేతలు కార్యకర్తలు, చంద్రబాబు కూడా అప్కాబ్ పదవి ఇస్తామని మాట ఇచ్చారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తిని ఇలా అవమానించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ..తన టికెట్‌ను కూడా త్యాగంచేసిన వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు నెట్టం రఘురాం అనుచరులు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి నెట్టెం రఘురామ్ కి రాష్ట్ర పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..