మత్స్యకారులకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధులు విడుదల.. 18న ఖాతాల్లోకి డబ్బు జమ..

YSR Matsyakara Bharosa: ఒకవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పధకాలతో..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులు విడుదల.. 18న ఖాతాల్లోకి డబ్బు జమ..
Jagan

Updated on: May 14, 2021 | 11:08 AM

YSR Matsyakara Bharosa: ఒకవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పధకాలతో దూసుకుపోతోంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే గంగపుత్రులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కింద వరుసగా మూడో ఏడాది రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే గురువారం రూ. 130.46 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 2019 నవంబర్ 21న 1,02,338 మందికి ఏపీ ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున వేట విరామ సాయం అందించిన సంగతి తెలిసిందే. అలాగే 2020లో 1.09 లక్షల కుటుంబాలకు సాయం అందించింది. ఇక ఈ ఏడాది 1,19,875 కుటుంబాలను అర్హులుగా తేల్చారు. ఇందులో 1,18,119 మంది బీసీలు, 747 మంది ఓసీలు, 678 మంది ఎస్సీలు, 331 మంది ఎస్టీలు ఉన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి నగదును జమ చేయనున్నారు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

Loading...
Unable to load recommendations.
Follow Us