
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపు కోసం ప్రధాన పార్టీల ప్రచారం ఇప్పట్నుంచే ఊపందుకుంటుంది. ఈ సారి జరుగబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన స్టార్ క్యాంపెనింగ్ ను తమ రాజకీయ మైలేజీ వాడుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆంధ్రప్రదేశ్ లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేయడానికి వస్తానని ప్రకటించడంతో ఆమె వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. 2019లో నరసాపురంలో తన తండ్రి నాగబాబు తరఫున ప్రచారం చేసిన తర్వాత ఆమె రెండోసారి ప్రచారం చేయబోతుండటం విశేషం.
2019 ఎన్నికల ప్రచారంలో జనసేన తరఫున ప్రచారం చేసినప్పుడు రైతులు, సామాన్య ప్రజల కష్టాలను కళ్లారా చూశానని, ఈ ఏడాది కూడా అదే పని చేయాలనుకుంటున్నానని నిహారిక తెలిపింది.
బాబాయ్ పవన్ కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. 2019లో ఆయనకు నా వంతు సహకారం అందించానని, ఈ ఏడాది కూడా పార్టీ కోసం, బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేస్తా అని చెప్పింది. తాజాగా మీడియా సమావేశంలో నిహారిక మాట్లాడుతూ.. తన ఓటు హక్కు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వరుణ్ తేజ్ తర్వాత ఆయన సోదరి నిహారిక జనసేనాని కోసం బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలో ఓ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమ తండ్రి నాగబాబుకు మద్దతుగా ఈ అన్నాచెల్లి ప్రచారం చేయబోతుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ రాజకీయ ప్రచార పర్వంలోకి నిహారిక ఎంట్రీ ఇస్తుండటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Happy birthday Kalyan babai!
More power to you! 🤗🌟#HBDPawankalyan pic.twitter.com/G4jfx282H5— Niharika Konidela (@IamNiharikaK) September 2, 2020