Andhra Pradesh: ప్రియుడితో శారీరక సుఖం కోసం పక్కా స్కెచ్.. కొడుకును ఒప్పించి మరీ..

|

Jul 15, 2022 | 9:59 AM

Andhra Pradesh: ఆమె వయస్సు ముప్పై ఆరేళ్లు. తీరని కామకోరికలతో రగిలిపోతూ తనకన్నా చిన్న వయస్సున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

Andhra Pradesh: ప్రియుడితో శారీరక సుఖం కోసం పక్కా స్కెచ్.. కొడుకును ఒప్పించి మరీ..
Police Arrest
Follow us on

Andhra Pradesh: ఆమె వయస్సు ముప్పై ఆరేళ్లు. తీరని కామకోరికలతో రగిలిపోతూ తనకన్నా చిన్న వయస్సున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా భర్త కళ్లు గప్పి బంధం కొనసాగిస్తుంది. అయినా ఏదో తీరని కోరికలు ఆమెను వేధిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియుడుతో కలవాలని అనుకుంది, కానీ భర్త అడ్డుగా ఉండటంతో ఏమి చేయలేకపోతుంది. తన పెళ్లి బంధం గొప్పదని, తన పిల్లల బరువు బాధ్యతలు భర్తే చూడాలన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా తన ప్రియుడుతో ఉన్న అక్రమ బంధం డామినేట్ చేసింది. ప్రియుడి ఆలోచన తప్పా ఇంకెవరితో పని లేదన్న ఆలోచనలో పడింది. అలా రగులుతున్న కోరికలతోనే మూడేళ్ళ పాటు చీకటి సంబంధం కొనసాగించింది.

అయితే అక్రమ సంబంధం ఎక్కువ రోజులు దాగదన్న విషయం వీరి విషయంలో కూడా రుజువైంది. ఆ నోటా ఈ నోటా పడి తమ చీకటి సంబంధం వెలుగులోకి వచ్చి భర్త వరకు చేరింది. దీంతో ఆ చక్కటి సంసారం ఇప్పుడు విషాదంగా మారింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం వద్ద జరిగిన సింగంపల్లి రాము హత్య కేసు ఇప్పుడు సంచలనం రేపుతుంది. పోలీసులు హత్యకేసును 24 గంటల్లోనే ఛేదించారు.

లక్కిడామ్ గ్రామానికి చెందిన సింగంపల్లి రాము భార్య తులసి కి, సాలూరు మండలం శంబర గ్రామానికి చెందిన బొంగు సన్యాసి నాయుడుకి మూడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధం ఆ నోటా ఈ నోటా పడి భర్త వరకు చేరింది.. దీంతో భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. జరుగుతున్న గొడవలో తప్పెవరిదో ఇంట్లోనే ఉంటున్న 15 ఏళ్ల కుమారుడికి మాత్రం తెలియదు. కానీ గొడవలు జరగటం చూస్తున్న కొడుకు ఒకింత ఆందోళనకు లోనవుతుండేవాడు. తెలిసి తెలియని వయస్సు, మనసంతా ఆందోళన ఏమి చేయాలో తెలియని అయోమయం. ఆ పిల్లాడి అయోమయమే భార్య తులసికి కలిసొచ్చింది.

మరోవైపు తమ వివాహేతర సంబంధానికి భర్త రాము అడ్డుగా ఉన్నాడని కక్ష కూడా రోజు రోజుకు పెంచుకుంది తులసీ. దింతో భార్య తులసి, ఆమె ప్రియుడు సన్యాసి నాయుడు అతడి అడ్డు తొలిగించుకోవాలని అదును కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే తులసి తన 15 ఏళ్ల కుమారుడిలో తన భర్తపై ఉన్నవి లేనివి చెప్పి.. తండ్రిపై అతనిలో ద్వేషం కలిగేలా చేసింది. అయితే, తల్లి దుర్భుద్ధిని గ్రహించలేని ఆ పిల్లాడు.. ‘నాన్నను చంపేద్దాం అందుకు సహకరించాలని ప్రోత్సహించిన తల్లి మాటలకు తలొగ్గాడు’. అందుకు తగ్గట్టుగా ప్రియుడితో కలిసి ప్లాన్ గీసిన తులసి, కొడుక్కి ఒంట్లో బాగోలేదని, హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని భర్త రాముకి చెప్పింది. వారి మాటలు నమ్మిన రాము ఈనెల 11 న, రాత్రి 9 గంటల సమయంలో కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి బయలు దేరాడు.

తల్లి ముందే చెప్పిన ప్లాన్ ప్రకారం, లక్ష్మీ సాగరం చెరువు దగ్గరకు వచ్చేసరికి బహిర్భూమికి వెళ్లాలని చెప్పి కొడుకు తండ్రి రాముని అక్కడ ఆపాడు.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న తులసి ప్రియుడు సన్యాసి నాయుడు తన వెంట తెచ్చిన బలమైన కర్రతో రాము తలపై చచ్చే వరకు చావగొట్టాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాము మృత దేహాన్ని చెరువు గట్టు నుంచి రోడ్డు పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఐతే ఆ సమయంలో వాహన రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో మృతదేహాన్ని అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు. మరుసటి రోజు రాము మరణవార్త తెలిసిన అతడి సోదరుడు కృష్ణ గంట్యాడ పోలీసులకి పిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..