Andhra Pradesh: మనిషి ఒక్కోసారి మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. కన్నుమిన్నూ కానకుండా.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కొందరు కామాంధులు.. మరింత బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పసిపాపలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా తండ్రిలా భావించి పక్కన కూర్చున్న ఓ చిన్నారి(Minor Girl) పట్ల ఆ కీచకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ కుటుంబం ఒంగోలు(Ongole) వెళ్లేందుకు కడప నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus) ఎక్కారు. ఇద్దరు పిల్లలతో బస్సులోకి వచ్చిన దంపతులు తమ పక్కనే సీటు లేక పోవడంతో వెనుక ఉన్న ఓ సీటులో కూర్చో బెట్టారు. ఆ సీట్లో అప్పటికే ఓ పెద్ద మనిషి కూర్చున్నాడు. బాలికను కూర్చోబెట్టి పాపను చూసుకోమని చెప్పారు తల్లిదండ్రులు. తండ్రి వయసున్న వ్యక్తి కావడంతో నమ్మకంతో తమ మూడేళ్ళ బాబుతో ముందు సీట్లో కూర్చున్నారు ఆ దంపతులు. బస్సు కదిలింది. కాసేపటికే బాలిక పక్కనే ఉన్న ఆ పెద్ద మనిషిలో అసలు వ్యక్తి బయటకొచ్చాడు. చిన్నారి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది.
నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిచ్చాపాటీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి గుంటూరు కు వెళ్లేందుకు కడపకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అదే బస్సులో కడప సమీపంలోని చెన్నూరు వద్ద ఓ కుటుంబం ఒంగోలుకు వెళ్లేందుకు ఎక్కారు. అయితే, తమ ఎనిమిదేళ్ల మైనర్ బాలికను నారాయణ రెడ్డి పక్కన సీట్లో కూర్చోబెట్టారు ఆ దంపతులు. పాప తన పక్కన కూర్చున్న తరువాత అతనిలోని కామాంధుడు బయటకు వచ్చాడు. ఆ పాపతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. బాలిక తల్లిదండ్రులు నారాయణ రెడ్డి పై గొడవకు దిగారు. అప్పటికే బస్సు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోవడంతో అక్కడ అతనిపై ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు, ప్రయాణికులు. దీంతో దుత్తలూరు పోలీసులు నిందితుడు నారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు.
-మురళి, టీవీ9 తెలుగు, నెల్లూరు.
Also read:
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాలీ ఆటోను ఢీకొన్న బొలెరో.. నలుగురు మృతి