ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంపై మరోసారి స్పష్టత!

Polavaram Project Designs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి...

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంపై మరోసారి స్పష్టత!
Polavaram

Updated on: Jul 26, 2021 | 6:46 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. హెడ్‌వర్క్స్, డిజైన్ల మార్పుతో పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 7,192 కోట్లకు పెరిగిందని ఏపీ చెప్పగా.. ప్రాజెక్ట్‌ డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్ నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే భరిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

గోదావరి ట్రైబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్ట్ డిజైన్లు ఉండాలని కేంద్రమంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఆయా డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్‌లో కొన్ని డిజైన్లను మార్పు చేయాలని ఏపీ కోరిందని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు సీడబ్ల్యూసీ మార్పులను చేసిందన్నారు. కాఫర్ డ్యామ్, పునాది పనులు, స్పిల్ వే, డయాఫ్రం వాల్ పనులు, చిప్పింగ్, స్పిల్ వే కాంక్రీట్ పనులు అదనంగా చేపట్టామని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు. అయితే వాటి కోసం అదనంగా నిధులు కేటాయించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us