Kesineni Brothers: పీఎస్‌కు చేరిన కేశినేని బ్రదర్స్ గొడవలు.. ఆయన కారును అడ్డగించిన పోలీసులు..

|

Jul 20, 2022 | 12:15 PM

Kesineni Brothers: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలు తారా స్థాయికి చేరాయి. సొంత తమ్ముడు కేశినేని శివనాథ్‌పై పోలీసుకు ఫిర్యాదు చేశారు ఎంపీ కేశినేని నాని.

Kesineni Brothers: పీఎస్‌కు చేరిన కేశినేని బ్రదర్స్ గొడవలు.. ఆయన కారును అడ్డగించిన పోలీసులు..
Kesineni Brother
Follow us on

Kesineni Brothers: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలు తారా స్థాయికి చేరాయి. సొంత తమ్ముడు కేశినేని శివనాథ్‌పై పోలీసుకు ఫిర్యాదు చేశారు ఎంపీ కేశినేని నాని. కార్‌పై ఇల్లీగల్‌గా తన ఎంపీ స్టిక్కర్‌ వేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంపీ నాని. ఎంపీ వీఐపీ వాహన స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతుందని పేర్కొన్నారు. విజయవాడ పటమట పోలీసులకు మే నెల 27న నాని ఫిర్యాదు చేశారు. జూన్ 9వ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీ 420, 416, 415, 468, 499 రెడ్ విత్ 34 కింద సు నమోదు చేశారు. TS 07HW 7777 నెంబర్ గల వాహనానికి నకిలీ ఎంపీ స్పీకర్లు వేసి చెలామణి అవుతున్నాని గుర్తించిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఆ కారు కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాథ్ భార్య జానకిలక్ష్మి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కారును కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కేశినేని నానికి స్వయంగా సోదరుడైన చిన్ని.. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో స్థిరపడి వ్యాపారం చేస్తున్నాడు. కాగా, ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇదిలాఉంటే.. ఈ అంవంపై కేశినేని శివనాథ్ స్పందించారు. చిల్లర వివాదంలోకి కేశినేని నాని తన భార్యను లాగడం బాధాకరం అని అన్నారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలుతుందన్నారు. హైదరాబాద్‌లో తన కారును పోలీసులు ఆపారని, పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారని, ఎంక్వైరీ చేశారని చెప్పారు. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదకన్నారు. తాను టీడీపీలో ఓ చిన్న కార్యకర్తను మాత్రమేనని, చంద్రబాబు సీఎం కావడమే తమ లక్ష్యమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరిపితే కూడా వివాదం చేశారని అన్నారు. నాని తన శత్రువు కాదని, తన సొంత అన్న అని అన్నారు. పార్టీలో తాను ఓ చిన్న కార్యకర్తను మాత్రమే అన్న ఆయన.. తాను ఎంపీగా పోటీ చేస్తానని ఎవరినీ టిక్కెట్ అడగలేదన్నారు.

ఇవి కూడా చదవండి

తమ పార్టీ అధినేత చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేశినేని శివనాథ్ తెలిపారు. రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నానా? ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది..? అని అన్నారు. హైదరాబాద్ పోలీసులు తన కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదన్నారు. తనపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.. కానీ ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదన్నారు. పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..