
Karnool Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి బైక్ పై వెళ్లిన శివశంకర్ మద్యం మత్తే కారణమని పోలీసుల నిర్ధారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లక్ష్మీపురం దగ్గర ఫుల్లుగా మద్యం సేవించిన శివశంకర్.. తెల్లవారుజామున 2.23 నిమిషాలకు పెట్రోల్ బంక్ లో మద్యం మత్తులో బైక్ పైనుంచి శివ శంకర్ కింద పడబోయినట్లు పోలీసులు తెలిపారు. శివ శంకర్ ఆ మద్యం మత్తులోనే హైవేపై డివైడర్ కు ఢీకొని బైక్ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఎర్రి స్వామి శివశంకర్ డెడ్‌బాడీని రోడ్డుమీద నుంచి పక్కకు లాగాడు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న బైక్ ను పక్కకు జరుపుదామనే సమయంలోనే వేగంగా వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి వంటలు వ్యాపించాయని, దీంతో 19 మంది సజీవ దహనం అయినట్లు దర్యాప్తులో తేల్చారు.
అయితే శివ శంకర్ బైక్ వెనుకాల ఉన్న ఎర్రి స్వామికి గాయాలతో బయటపడ్డాడు. దీంతో ఈ ప్రమాదంపై కూడా ఆయన కీలక విషయాలు వెల్లడించాడని పోలీసులు వెల్లడించారు. 24న తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఎర్రి స్వామి, శివ శంకర్ ఇద్దరు కలిసి బైక్ పై వెళ్తున్నారు. చిన్నటేకూరు దగ్గర శివ శంకర్ బైక్ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు తెలిపాడు.
ఆ తర్వాత శివశంకర్ సెల్ ఫోన్ తీసుకుని తన స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లి వెళ్లాడు ఎర్రి స్వామి. శివ శంకర్ సెల్ ఫోన్ ఎర్రి స్వామి దగ్గర ఉన్నట్లు సెల్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదంపై గుట్టు విప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రి స్వామి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగడానికి ముందే శివశంకర్ మృతి చెందినట్లు వెర్రిస్వామి వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి