AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలో భార్యాభర్తలు.. ఇద్దరూ జోరుగా ప్రచారం

|

Feb 11, 2021 | 8:40 AM

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి ..

AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలో భార్యాభర్తలు.. ఇద్దరూ జోరుగా ప్రచారం
Follow us on

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొన్ని పంచాయతీల్లో అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు పోటీ చేస్తుండగా, ఇక్కడ మాత్రం భార్యాభర్తలు బరిలో ఉండటం విశేషం. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరుకు చెందిన భార్యాభర్తలు ఇద్దరూ పంచాయతీ సర్పంచ్‌ రేసులో ఉన్నారు. అల్లూరు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థులుగా ఐదుగురు రంగంలో ఉన్నారు.

ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా సోమేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి రాధిక, ఆమె భర్త రెడ్డి విఠల్‌ ఇద్దరూ బరిలో ఉన్నారు. గ్రామంలో శివాలయాన్ని ఆమె చైర్‌పర్సన్‌గా అభివృద్ధి చేశారు. తన సొంత నిధులు రూ.3.5 లక్షల వరకు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. అయితే గ్రామాభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగారు. ఆమెతో పాటు భర్త విఠల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే అనివార్య కారణాలతో ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేకపోయారు. ఆమెకు ఉంగరం, భర్త విఠల్‌కు బుట్ట గుర్తులను కేటాయించారు. ఇద్దరూ కలిసి ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరుతున్నారు.

Also Read: తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత.. చంద్రబాబు ఏమన్నారంటే..