
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్.. తన భార్య మాయతో కలిసి 8 నెలల క్రితం పొట్టకూటి కోసం అనకాపల్లి జిల్లాకు వచ్చేశాడు. ఎలమంచిలిలో ఓ స్క్రాప్ దుకాణాన్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు రాకేష్. అక్కడే భార్య, నాలుగు నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నాడు. మాయ 12 ఏళ్ల పెద్ద కుమార్తె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో సెల్‌ఫోన్ కలహాన్ని నింపింది. మాయ.. సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందని గమనించిన రాకేష్ పలుమార్లు ప్రశ్నించాడు. ఈ విషయంలో గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం కూడా రాకేష్ బయటకి వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి భార్య మాయ.. ఫోన్ మాట్లాడుతూ లీనమై ఉంది. వెంటనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్.. ఆమెను ప్రశ్నించాడు. మాట మాట పెరిగింది.
దీంతో మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పక్కనే ఉన్న 4నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్య మాయ ఫోన్‌లో మాట్లాడుతోందని గుర్తించిన రాకేష్.. అనుమానంతో హత్య చేశాడని ఎలమంచిలి సిఐ ధనుంజయ తెలిపారు.
మాయకు నాలుగు నెలల చిన్నారి ఉంది. తల్లి కోల్పోవడంతో చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసిడిఎస్ సిబ్బంది. తల్లి లేక ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి సపర్యలు చేస్తున్నారు. మాయ ఇద్దరు పిల్లలు.. తొలి భర్తకు పుట్టిన కూతురు అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. రాకేష్, మాయ దంపతులకు ఇటీవలే ఓ చిన్నారి జన్మనిచ్చింది. చిన్నారికి నాలుగు నెలలు. మాయకు ఇద్దరు పిల్లలు.. 12 ఏళ్ల మొదటి పాప అమ్మమ్మ దగ్గర ఉంటుందని.. మాయ రాకేష్ దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉందని అన్నారు సీఐ ధనంజయ. తల్లి కోల్పోవడంతో చిన్నారిని ఐసిడిఎస్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో ఉంచామన్నారు.